ETV Bharat / city

నర్సీపట్నం పులిని చూసి.. పులివెందుల పిల్లి భయపడింది: లోకేశ్ - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

LOKESH ON AYYANA INCIDENT: మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

LOKESH ON AYYANA INCIDENT
LOKESH ON AYYANA INCIDENT
author img

By

Published : Jun 19, 2022, 9:32 AM IST

Updated : Jun 20, 2022, 8:54 AM IST

LOKESH ON AYYANA INCIDENT: నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు.

  • .@AyyannaPatruduC గారిపై వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుంది.(3/3)

    — Lokesh Nara (@naralokesh) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అచ్చెన్నాయుడు: ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్ ప్రభుత్వం మార్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అతిప్రవర్తనకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.

నక్కా ఆనందబాబు: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. అక్రమ కట్టడాలు కడితే పద్ధతి ప్రకారం వెళ్లాలని.. తెల్లవారు జామున అయ్యన్న ఇంట్లోకి అధికారులు దొంగల్లాగ ప్రవేశించడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అయ్యన్న పాత్రుడు ఇంటి పై దాడి చేశారని ఆరోపించారు.

యనమల రామకృష్ణుడు: మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు అయ్యన్న ఇంటి గోడలు కూల్చడం సిగ్గుచేటని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. అక్రమ కట్టడం అంటూ పోలీసులు, ఇతర అధికారులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్​కు మాత్రమే వస్తాయనే విషయం మరోసారి నిరూపితమైందని దుయ్యబట్టారు.

కనకమేడల: ‘ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన విజయవంతం కావడం జీర్ణించుకోలేకే వైకాపావారు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటి గోడను కూల్చడం చట్టవ్యతిరేకం. ఆయన ఏ భూమినీ ఆక్రమించలేదు. ఈ అనైతిక దాడికి న్యాయస్థానంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఎంపీ కనకమేడల రవీంద్ర పేర్కొన్నారు.

జవహర్‌: ‘అయ్యన్నపాత్రుడి ఇంటిపై సీఎం జగన్‌ చేయించిన దాడి పిరికిపంద చర్య. శని, ఆదివారాలను బుల్‌డోజర్‌ రోజులుగా ప్రకటించాలి. పరిపాలనలో లోపాలను ప్రశ్నిస్తే ఇళ్లపై పడతారా?’ అని మాజీ మంత్రి జవహర్‌ ప్రశ్నించారు.
బోండా ఉమ: తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ తెదేపా నేతల ఇళ్లని కూలుస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మండిపడ్డారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని గుర్తుచేశారు. ఇవాళ జగన్​ది కావొచ్చు.. కానీ, రేపు తమదని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక తెదేపా నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా అని నిలదీశారు. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారని.. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు.

చినరాజప్ప: చంద్రబాబు మినీమహానాడు కార్యక్రమాలకు వస్తున్న ప్రజా స్పందనను చూసి సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెదేపా నాయకుడు అయ్యన్నపాత్రుడిపై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమిరెడ్డి: భారతీయ పౌరులుగా ఉండే హక్కులేవీ రాష్ట్రంలో తమకు ఉండట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారం ఉంది కదా అని పోలీసుల్ని గూండాల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్​రెడ్డి రౌడీ రాజ్యానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా దాడులపై ఇంతవరకు పోలీసులు ఒక్క చర్యా ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.

బుద్ధా వెంకన్న: జగన్మోహన్ రెడ్డి బీసీలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాలను డీజీపీ అమలు చేస్తున్నారని విమర్శించారు. నిబంధనలకు‌ విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు యాత్రకు విశేష స్పందన వచ్చిందని.. అందుకే జగన్​లో వణకు మొదలైందని ధ్వజమెత్తారు. జగన్‌ దుర్మార్గపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి: జగన్మోహన్​రెడ్డి పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇదొక శునకానంద చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

బచ్చుల అర్జునుడు: అయ్యన్నపాత్రుడు ఇంటిపై జేసీబీతో దాడి దుర్మార్గపు చర్య అని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలను బయటపెడితే ఇళ్లు కూల్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలేంటని నిలదీశారు. వైకాపా బెదిరింపులు, దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరని హెచ్చరించారు. వైకాపా దుర్మార్గ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

బీద రవిచంద్ర : బీసీ నేతలంటే వైకాపా ప్రభుత్వానికి ద్వేషమెందుకని తెదేపా నేత బీద రవిచంద్ర ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ దౌర్జన్యాలను, అవినీతిని ప్రశ్నించడమే అయ్యన్న పాత్రుడు చేసిన నేరమా అని నిలదీశారు. బీసీ నేత అయ్యన్న గొంతు నొక్కేందుకు వైకాపా ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దొడ్డి దారిన దాడులకు వైకాపా ప్రభుత్వం ఉపక్రమిస్తోందని ధ్వజమెత్తారు.

గుమ్మడి సంధ్యారాణి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడిని తెదేపా సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఖండించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను బయటపెడితే ఇళ్లు కూల్చేస్తారా అని ప్రశ్నించారు. మూడేళ్ల తరువాత అయ్యన్న గారి ఇల్లు అక్రమ నిర్మాణమని గుర్తొచ్చిందా అని నిలదీశారు.

కాలవ శ్రీనివాసులు: ‘అధికార మదంతో జగన్‌రెడ్డి చేస్తున్న అకృత్యాలకు అంతులేకుండా పోతోంది. పాలకుల వైఫల్యాలను ఎండగడితే కక్షసాధింపునకు పాల్పడడం దుర్మార్గం. రాజకీయాల్లో ఇలాంటి దుష్ట సంప్రదాయాలు మంచివి కాదు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

వర్ల రామయ్య: ‘వందలమంది పోలీసులతో వచ్చి జేసీబీలతో ఇంటి ప్రహరీ కూల్చి భయభ్రాంతుల్ని చేయడం ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన. ప్రత్యర్థులు తప్పు చేశారని చెబుతూ ప్రభుత్వం పెద్ద తప్పులు చేస్తోంది. అయ్యన్నపాత్రుడు ఏదైనా చేస్తే చట్టం ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతేగానీ ఏదో వంకతో ఇంటి ప్రహరీ కూల్చడం లాంటి చర్యలకు ఆదివారమే లక్ష్యం కావడం ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనం’.

నాదెండ్ల బ్రహ్మం : ‘ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు మానుకోవాలి. అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని కూల్చడం జగన్‌ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనం. తెదేపాకు వెన్నెముకగా నిలిచిన బీసీ నేతల్ని ప్రభుత్వం వెంటాడి వేధిస్తోంది’.

ఇవీ చదవండి:

Last Updated : Jun 20, 2022, 8:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.