ETV Bharat / city

TDP leader Somireddy జగన్ ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదన్న సోమిరెడ్డి

Somireddy on farmers suicides జగన్​ పాలనతో ఏపీ అభివృద్ధిలో పోటీ పడకపోయినా రైతు ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకు ముగ్గురు అన్నదాతల బలవన్మరణాలతో మూడు రైతు కుటుంబాలు దిక్కులేనివైపోతున్నాయని వాపోయారు. ఈ మూడేళ్ల మూడు నెలల పాలనలో వ్యవసాయానికి కేటాయించిన నిధులు, ఖర్చుపెట్టిన మొత్తంపై అంశాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP leader Somireddy
సోమిరెడ్డి
author img

By

Published : Aug 29, 2022, 4:47 PM IST

Somireddy on farmers suicides: జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిలో పోటీ పడకపోయినా రైతు ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకు ముగ్గురు అన్నదాతల బలవన్మరణాలతో మూడు రైతు కుటుంబాలు దిక్కులేనివైపోతున్నాయని వాపోయారు. అన్నం పెట్టే రైతుకు ఈ పరిస్థితి రావడం బాధాకరమన్నారు. కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేకపోగా కేంద్ర ప్రభుత్వం దేశమంతా అమలు చేస్తున్న యంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి రైతు ప్రోత్సాహక పథకాలను ఏపీలో ఆపే హక్కు.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో సగం అమలు చేసినా ఏపీ రైతుకు దుర్గతి పట్టేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించక రైతు ఎక్కువ నష్టపోతున్న రాష్ట్రాల్లోనూ ఏపీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధర నిర్ణాయక కమిటీ(సీఏసీపీ) నివేదిక స్పష్టం చేసిందని సోమిరెడ్డి గుర్తు చేశారు. దేశంలో రైతు సగటు తలసరి అప్పు రూ.75 వేలుగా ఉంటే ఏపీలో మాత్రం రూ.2.45 లక్షలుగా ఉండటాన్ని తప్పుబట్టారు. కనీస మద్దతు ధర పొందే విషయంలో భారీ నష్టంతో పాటు చివరికి తలసరి అప్పు విషయంలోనూ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయడంలో ముందున్న వైకాపా ప్రభుత్వం.. రైతులకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా వ్యవసాయ బడ్జెట్​కు విలువ లేకుండా చేయటం క్షమించరాని నేరమని విమర్శించారు. జగన్ రెడ్డికి కొంచెం నిజాయతీ ఉన్నా... ఈ మూడేళ్ల మూడు నెలల పాలనలో వ్యవసాయానికి కేటాయించిన నిధులు, ఖర్చుపెట్టిన మొత్తంపై అంశాల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • . @ysjagan ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదు

    ఏపీ అభివృద్ధిలో పోటీ పడకపోయినా రైతు ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేయడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. (1/4)#JaganPaniAyipoyindhi pic.twitter.com/bWPRP8LLl8

    — Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) August 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • దేశంలో రైతు సగటు తలసరి అప్పు రూ.75 వేలుగా ఉంటే ఏపీలో మాత్రం రూ.2.45 లక్షలుగా ఉంది. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అన్నదాతల ఆత్మహత్యలు, కనీస మద్దతు ధర పొందే విషయంలో భారీ నష్టంతో పాటు చివరికి తలసరి అప్పు విషయంలోనూ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం బాధాకరం. (4/4)

"జగన్ ప్రభుత్వానికి రైతుబిడ్డల ఆత్మఘోష తప్పదు. అభివృద్ధిలో పోటీపడకపోయినా రైతు ఆత్మహత్యల్లో ముందుంది. రైతు ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో ఏపీది మూడో స్థానం. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతోనే ఈ పరిస్థితి. బలవన్మరణాలతో రైతు కుటుంబాలు దిక్కులేనివైపోతున్నాయి. అన్నం పెట్టే రైతుకు ఈ పరిస్థితి రావడం బాధాకరం. వ్యవసాయానికి నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి." -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.