ETV Bharat / city

lokesh fire on cm jagan జగన్‌ సీఎం అయ్యాకే మహిళలపై దాడులు పెరిగాయి: లోకేశ్‌

రమ్య కుటుంబానికి పరిహారమిచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రమ్య కుటుంబానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు.

నారా లోకేశ్ ప్రెస్ మీట్
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
author img

By

Published : Aug 16, 2021, 10:45 PM IST

రమ్య కుటుంబానికి 21 రోజుల్లో న్యాయం జరగకుంటే మళ్లీ రోడ్డెక్కుతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్నిహెచ్చరించారు. సర్కారు చెప్పే దిశా చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల తీరు వల్లే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. రెండేళ్లలో 500మందికి పైగా దాడులు జరిగాయని తెలిపారు. 'జగన్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన కుటుంబంలో ఏదైనా జరిగితే జగన్ రెడ్డి ఇలానే వ్యవహరిస్తారా' అని లోకేశ్​ ప్రశ్నించారు. బాధిత కుటుంబ పరామర్శకు వెళ్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. నిజాలు బయటకొస్తే రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుందని ప్రభుత్వ భయమా? అని ధ్వజమెత్తారు. ఏం తప్పు చేశానని తనను, తెదేపా నేతలను పోలీసు స్టేషన్​లో నిర్బంధించారని నిలధీశారు.

సొంత చెల్లికి న్యాయం చేయలే.. ఇక రాష్ట్ర ప్రజలకు ఎం చేస్తారు...

సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఇంకేం న్యాయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాకే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మహిళల్ని కించపరిచే విధంగా మంత్రులే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దిశ చట్టం పేరుతో ఏ ఒక్కరికీ శిక్షపడలేదని లోకేష్​ ఆరోపించారు. బాధిత కుటుంబానికి పరిహారమిచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోందన్న లోకేశ్.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రమ్య కుటుంబానికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. హజీర్ హత్య జరిగి ఏడాదవుతున్నా.. న్యాయం జరగలేదన్న లోకేశ్‌.. తెదేపా నేతలపై దాడుల విషయమై ప్రైవేటు కేసులు పెడతామన్నారు. రేపు కర్నూలులో పర్యటిస్తామన్నారు.

అసలు ఏం జరిగిందంటే..

గుంటూరులోని కాకాని రోడ్డులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆయన్ను విడుదల చేయాలంటూ తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో సాయంత్రం 5.30 ప్రాంతంలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చి, ఆయన కాన్వాయ్‌లోనే గోప్యంగా తరలించారు. పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్డుల్లో కొద్దిసేపు తిప్పిన తర్వాత పెదనందిపాడు, పొన్నూరు,గుంటూరు మీదుగా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నోటీసులపై సంతకం తీసుకొని స్టేషన్‌ నుంచి విడుదల చేశారు.

ఇదీచదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.