ETV Bharat / city

సీఎం జగన్​ తప్పుడు నిర్ణయాల వల్లే.. ప్రజలపై విద్యుత్‌ భారం: లోకేశ్​

author img

By

Published : Mar 31, 2022, 4:10 PM IST

Updated : Apr 1, 2022, 5:02 AM IST

Lokesh Protest Against Power Charges Hike in AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్​ చేశారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. వైకాపా పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా 'అంధకార ప్రదేశ్' పేరుతో లాంతరు ప్రదర్శన చేపట్టారు.

Lokesh protest against Power Charges hike in ap

Lokesh on Power Charges: ముఖ్యమంత్రి జగన్‌.. తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం పడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన జగన్​.. రకరకాల పన్నులు వేస్తూ ప్రజలపై భారం మోపారని దుయ్యబట్టారు. పీపీఏలను కొనసాగించి ఉంటే విద్యుత్ ఛార్జీలు పెరిగేవి కాదన్నారు. కరెంట్​ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తెదేపా పోరాడుతుందని లోకేశ్​ స్పష్టం చేశారు.

Lokesh Protest Over Electricity Charges: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నారా లోకేశ్​ వినూత్న నిరసన చేపట్టారు. లాంతరు చేత పట్టుకొని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. 'అంధకార ప్రదేశ్​' పేరుతో లాంతరు ప్రదర్శన చేపట్టారు. ప్రిజనరీ ఆలోచనాలతోనే పేదలపై భారం మోపారని దుయ్యబట్టారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా ఛార్జీలు పెంచారన్న లోకేశ్‌... ధనవంతులకు మాత్రం తక్కువ భారం పడేలా ఛార్జీలు ఉన్నాయని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు: తెదేపా ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని లోకేశ్​ గుర్తుచేశారు. తెదేపా హయాంలో ఛార్జీలు పెంచామన్నది పూర్తి అవాస్తవమన్నారు. విద్యుత్ లోటు వల్ల బహిరంగ మార్కెట్టులో విద్యుత్ కొనుగోలు చేసే అంశంలో కూడా కుంభకోణం చేశారు.. త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు. అప్పుడు చంద్రబాబు అమలు చేసిన సంస్కరణల వల్ల ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటే.. ఇప్పుడు వైకాపా విధానాలతో విద్యుత్ లోటు రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచడంపై తెదేపా నాయకులు, కార్యకర్తలు గురువారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. భిక్షాటన చేసి, లాంతర్లు పట్టుకుని నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు లాంతర్లు, విసనకర్రలు చేతబూని ప్రదర్శన చేశారు. ప్రజలకు సక్రమంగా కరెంటు ఇవ్వడం చేతగాని ప్రభుత్వానికి బిల్లులు పెంచే హక్కు ఎవరిచ్చారని ఉమా మండిపడ్డారు. పెంచిన కరెంటు బిల్లులు కట్టాలంటే భిక్షాటన చేయాల్సిందేనంటూ.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జోలె పట్టారు.

* అధికారంలోకి రాకముందు.. అప్పటి ప్రభుత్వంపై ‘బాదుడే బాదుడు’ అని విమర్శలు చేసిన జగన్‌ ఇప్పుడు మడమ తిప్పి విద్యుత్‌ ఛార్జీలు పెంచారని మాజీ మంత్రి కళా వెంకటరావు ధ్వజమెత్తారు.

* విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొటారుబిల్లి కూడలిలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సాలూరులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో తహసీల్దారు కార్యాలయం ఎదుట తెదేపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జడ్పీ మాజీ ఛైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

* అనంతపురం విద్యుత్తుశాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట చంద్రదండు అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయుడు విసనకర్రలు, లాంతర్లతో నిరసన తెలిపారు.

* ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, సీఎస్‌పురం తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. కనిగిరి, పామూరుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు, లాంతర్లతో ప్రదర్శన చేశారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ఇదీ చదవండి:

CPI Protest: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు

Last Updated : Apr 1, 2022, 5:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.