తనను మోసం చేసి తన మూడెకరాల పొలాన్ని కబ్జా చేశారని.. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి(suicide attempt) పాల్పడ్డారు. అనంతపురం రూరల్ అక్కంపల్లి గ్రామ సర్వే నెంబర్ 176 లో.. లక్ష్మీరెడ్డి(lakshmi reddy) అనే వ్యక్తికి చెందిన పొలాన్ని.. కొడిమి గ్రామానికి చెందిన లింగారెడ్డి, హరినాథ్ రెడ్డి అనే వ్యక్తులు అనంతపురం ఎమ్మార్వోతో కుమ్మక్కై తన పొలాన్ని వారి పేరిట రాయించుకున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ (collector) కు.. స్పందన కార్యక్రమంలో లక్ష్మీరెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదును అందించారు. తన మిత్రులకు సంబంధించిన పొలాన్ని విక్రయించే విషయంలో.. షూరిటీ దారుడిగా (surity) ఉండాలని సంతకాలు సేకరించినట్లు కలెక్టర్‌కు చెప్పారు.
సంతకాలు ఫోర్జరీ చేసి..
ఈ సంతకాలు ఫోర్జరీ (forgery) చేసి తన మూడు ఎకరాల పొలాన్ని వారి పేరిట రాయించుకుని.. తనకు అన్యాయం చేశారని లక్ష్మీరెడ్డి ఆవేదన చెందారు. దీనిపై ఎమ్మార్వో (MRO)కు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఎమ్మార్వోని వివరణ కోరగా.. 2018 నుంచి వీరి పొలం వ్యవహారం నడుస్తోందని.. ఇరువర్గాలు ప్రైవేట్ పరంగా పంచాయతీలు చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
చట్టప్రకారం లింగారెడ్డి అనే వ్యక్తికి సంబంధించి డాక్యుమెంట్లు కచ్చితంగా ఉన్నందున.. తాను ఆన్లైన్ విధానంలో నమోదు చేయాల్సి వచ్చిందని ఎమ్మార్వో తెలిపారు. ఈ విషయమై లక్ష్మీరెడ్డికి.. అనేకసార్లు నోటీసులు ఇచ్చామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన పని తాను చేశానని అన్నారు. ఆన్లైన్లో మాత్రమే లింగారెడ్డి పేరును నమోదు చేశామని, రికార్డుల ప్రకారం లక్ష్మీరెడ్డి పేరే ఉందని ఎమ్మార్వో తెలిపారు. ఏదైనా ఉంటే చట్ట ప్రకారం వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.
ఘటనపై స్పందించిన నారా లోకేశ్
రాష్ట్రంలో వైకాపా నేతల భూ కబ్జాల(land mafia)కు అడ్డూ అదుపులేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్(tdp leader nara lokesh) మండిపడ్డారు. అనంతపురం జిల్లా అక్కంపల్లిలో.. రైతు లక్ష్మీరెడ్డి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేశారంటే.. వైకాపా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న కొందరు అధికారులు.. వైకాపా నేతలతో కుమ్మకై రైతు భూమి కొట్టేసేందుకు కుట్రలు పన్నడం దారుణమని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌కు జత చేశారు.
-
వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చెయ్యడం దారుణం. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చెయ్యడం దారుణం. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) October 4, 2021వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చెయ్యడం దారుణం. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) October 4, 2021
ఇదీ చదవండి: