ETV Bharat / city

రాష్ట్రంలో నేడు రెండోవిడత వ్యాక్సినేషన్‌ స్పెషల్ డ్రైవ్‌ - katamneni bhasker

రాష్ట్రంలో కరోనా విలయతాండవంతో పరీక్షలు, పడకలు పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆర్టీపీసీఆర్‌తోపాటు ట్రూనాట్‌ టెస్టుల నిర్వహణకు సన్నద్ధమవుతుండగా వివిధ జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా కొవిడ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. అత్యవసర చికిత్సలు తప్ప సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు రెండోవిడత కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు.

Kovid Vaccine Special Drive in andhrapradhesh
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్
author img

By

Published : Apr 22, 2021, 2:28 AM IST

Updated : Apr 22, 2021, 2:49 AM IST

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని కలెక్టర్లను రాష్ట్రస్థాయి కొవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఛైర్మన్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఆర్టీపీసీఆర్‌తోపాటు ట్రునాట్ టెస్టులు కూడా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్‌ చాలా వేగంగా విస్తరిస్తోందన్న జవహర్‌రెడ్డి ప్రాథమిక కాంటాక్టు పరీక్షలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని, ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగాలని నిర్దేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లను తక్షణం అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం 19 వేల బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మరో 19 వేల పడకలు అందుబాటులోకి తేవాలన్నారు. జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు మొదలయ్యాయి.

ఆంక్షల విధింపు...

చిన్నారులకూ కొవిడ్‌ వైరస్ సోకుతున్న తరుణంలో గుంటూరు శివారులోని అడవితక్కెళ్లపాడులో పిడియాట్రిక్ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 5 నుంచి 15ఏళ్ల మధ్య పిల్లలకు అక్కడ చికిత్స చేస్తారు. ప్రకాశం జిల్లాలోని 19 మండలాల్లో త్వరలోనే ఆంక్షలు విధిస్తామన్నారు కలెక్టర్ పోలా భాస్కర్‌. నిత్యవసరాల కొనుగోళ్లకూ సమయం నిర్దేశించి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లాలో కొవిడ్ పరీక్షలను రెట్టింపు చేసి ఆస్పత్రుల్లో పడకలు పెంచుతామని కలెక్టర్‌ వివరించారు.

స్వచ్చందంగా మూసివేత...

కడపజిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర శస్త్రచికిత్సలు తప్ప మిగతా సాధారణ, ఎంపిక చేసిన సర్జరీల నిర్వహణను నిలిపి వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 8 ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా కొవిడ్ వైద్యశాలలుగా మార్చనున్నారు. కొవిడ్ రోగుల తరలింపునకు ప్రత్యేక అంబులెన్సులు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వ్యాపారులు స్వచ్ఛందగా దుకాణ పనివేళలు తగ్గించుకున్నారు. సాయంత్రం ఏడున్నర కల్లా మూసివేయనున్నారు.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశం...

కరోనా సెకండ్‌వేవ్ తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కొవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ చేపట్టున్నారు. గతంలో తొలిడోస్‌ తీసుకున్న వారికి నేడు రెండో డోస్‌ వేయనున్నారు. దాదాపు 6 లక్షల డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. తొలిడోస్‌ తీసుకున్న వారు తప్పనిసరిగా నేడు రెండోడోస్‌ వేయించుకోవాలని అధికారులు సూచించారు. రెండో డోస్‌ స్పెషల్‌ డ్రైవ్‌కారణంగా నేడు ఎవరికీ మొదటి డోస్‌ వేయడం లేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మొదటిసారి సమావేశంకానుంది. కొవిడ్ వ్యాప్తి నివారణ, వ్యాక్సినేషన్ అమలుపై సమీక్షించనుంది.

ఇదీచదవండి.

ఖాళీ అయిన ఆక్సిజన్​.. ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి

Last Updated : Apr 22, 2021, 2:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.