ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు - state

బక్రీద్​ పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాలో వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరుల పవిత్ర ప్రార్థనలు
author img

By

Published : Aug 12, 2019, 1:31 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు

రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్​ను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. బక్రీద్​ ముస్లిం క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్​- హిజాహ్​ పదో రోజన ఈద్​ అల్​ అద్హాను జరుపుకుంటారు. అదే సమయంలో హజ్ యాత్ర జరుగుతుంది. బక్రీద్ ముందు రోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని నమ్ముతారు.

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్​ స్టేడియం వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ప్రార్థనలో పాల్గొని బక్రీద్​ శుభాకాంక్షలు తెలిపారు.

కడప జిల్లా మైదుకూరులో బక్రీద్​ సందర్భంగా మత గురువు ఫజుల్​ రెహమాన్​ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న ముస్లింలు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరిలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా కోడుమూరులో బక్రీద్​ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఇళ్లలో పెద్దలకు సాంబ్రాణి వేసి ప్రార్థనలు చేశారు.

ఇదీ చదవండి... వాగు ఉప్పొంగింది.. వారికి తాడే తోడైంది!

Intro:ap_rjy_36_12_varada_nevaasam_av_ap10019. తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వరద తగ్గినా. ..నావలపైనే మత్స్యకారులునివాసం

Conclusion:తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరం ఆనకట్టు నుండి సముద్రంలోకి వదిలే వరదనీరు తగ్గటంతో నదీపరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.తూర్పుగోదావరి ముమ్మి నియోజకవర్గంలోని నాలుగు మండల్లో రెండువేల మంది పదిరోజులనుండి నివాసాలు వరదనీటిలో మునిగిఉండటంతో జీవనాధారంగా ఉపయోగించే నాటుపడవలే మత్స్యకారులకు ఆవాసాలుగా మారాయి.చెట్టుక్రిందనీడన కొందరు. టార్పాలిన్ డేరాలు కట్టుకుని మరికొందరు పదిరోజులు గడిపారు. మూడురోజులు పాఠశాలలకు ఉద్యోగులకు సెలవులుకావడంతో వరదను చూసేందుకు అధికసంఖ్యలో ప్రజలు నదీతీరాలకు చేరుకుని వరద ప్రవాహంతో సెల్ఫీలు తీసుకుని పదిలపరుచుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.