ETV Bharat / city

ఇకపై వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం

ఇకపై వార్డు సచివాలయాల్లోనూ నిత్యం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ....పురపాలక కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Jan 30, 2020, 5:31 AM IST

spandana programme at ward secretaries
spandana programme at ward secretaries

ఫిబ్రవరి నెలలో మెుదటి వారం నుంచి వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురపాలక, నగరపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి బొత్స.. వార్డు సచివాలయాల ద్వారా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలన్నీ అర్హులైన అందరికీ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. పథకాల లబ్ధిదారుల జాబితాలను వార్డు సెక్రటేరియట్​లలోని నోటీసు బోర్డుల్లో ఉంచాలని చెప్పారు. వార్డు సెక్రటరీల వేతనాలన్నీ సకాలంలో అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో వస్తున్న ఆరోపణలు, అక్రమాలకు తావివ్వకుండా ఉండేందుకు ముగ్గురు అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వే విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు.

ఇకపై వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం

ఇదీ చదవండి: ఆ ప్రాంతం...అరకు జిల్లాలో చేరనుందా..? ‘శ్రీకాకుళం నుంచి విడిపోనుందా..!

AP_VJA_04_30_Spandana_at_ward_secretariats_pkg_3052784 Reporter:T.Dhanunjay Camera: bhaskar ( ) ఇక నుంచి వార్డు సచివాలయాల్లోనూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వార్డు, గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. అటు వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సూచించింది. భవన నిర్మాణ అనుమతుల జారీ పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై 110 మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి బొత్స వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. look.. vo1: ప్రజా సమస్యల పరిష్కారంలో వేగాన్ని పెంచే దిశగా వార్డు సచివాలయాల్లోనూ నిత్యం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పురపాలక శాఖ మంత్రి పురపాలక కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వచ్చే నెల మొదటి వారం నుంచే దీనిని అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈమేరకు 110 మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల కమిషనర్లతో మంత్రి వీడియోకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో వస్తున్న ఆరోపణలు,అక్రమాలకు తావివ్వకుండా ఉండేట్లు చూసేందుకు రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వార్డు సచివాలయాల ద్వారా పూర్తి పారదర్శకతతో , ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలన్నీ అర్హులైన అందరికీ అందేలా చూడాలన్నారు. ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని, ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలను వార్డు సెక్రటేరియట్ లలోని నోటీసు బోర్డుల్లో ఉంచాలని మంత్రి చెప్పారు. vo2: వార్డు సెక్రటరీల వేతనాలన్నీ సకాలంలో అందేలా చూడాలని కమిషనర్లకు ఆదేశాలిచ్చిన మంత్రి వచ్చే వారం రోజుల్లో పెండింగ్ అనేది లేకుండా చెల్లించాలనీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణం కోసం లబ్ధిదారుల ఎంపిక సర్వే విషయంలో జాప్యం చేయవద్దని, అర్హులైన అందరిని గుర్తించడంతోపాటు, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత కమిషనర్లదే అని మంత్రి అన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభించని పరిస్థితి ఉందని, దీనికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పురపాలక పాఠశాలల స్థితి గతులు, బిఆరఎస్ అమలులో జరుగుతున్న జాప్యం, పారిశుధ్ద్య నిర్వహణ తదితర అంశాలను మంత్రి సమీక్షించారు. భవన నిర్మాణాల అనుమతుల జారీలోఅధిక శాతం డీమ్డ్ అప్రూవల్ గా అవుతున్న అంశాలను పరిశీలించి, అందుకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బిపిఎస్ దరఖాస్తులను కూడా త్వరతగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.