LIVE : తిరుమలలో చంద్రబాబు - శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu Tirumala Tour LIVE - CM CHANDRABABU TIRUMALA TOUR LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 7:54 PM IST
|Updated : Oct 4, 2024, 8:07 PM IST
CM Chandrababu Move for Tirumala to Participate in Srivari Brahmotsavam LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నుంచి తిరుమల బయలుదేరారు. రాత్రికి సతీసమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముందుగా తిరుపతి చేరుకోనున్న సీఎం అక్కడ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమలకు చేరుకొని స్వామి వారి దర్శనం చేసుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుడతారు. భక్తులకు కల్పించే అన్నప్రసాదానికి సంబంధించి అత్యాధునిక వకులమాత సెంట్రలైజ్‌డ్ కిచెన్ ను చంద్రబాబు ప్రారంభిస్తారు.కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈరోజు నుంచి ప్రతిరోజు స్వామివారికి వాహన సేవలు నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వం ముస్తాబైంది. ఈరోజు (శుక్రవారం) నుంచి 12 వరకు అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందురోజు నిర్వహించే అంకురార్పణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Oct 4, 2024, 8:07 PM IST