ETV Bharat / international

'ఇజ్రాయెల్‌ను అమెరికా పావుగా వాడుకుంటోంది!'- అందుకే వారికి ఖమేనీ టార్గెట్!! - Israel Missile Strike - ISRAEL MISSILE STRIKE

Israel Missile Strike : హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Israel Missile Strike
Israel Missile Strike (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2024, 7:36 PM IST

Israel Missile Strike : హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌ సమీపంలోని ఓ ప్రాంతం సహా మరోచోట వైమానిక దాడులు చేసింది. హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా వారసుడిగా భావిస్తున్న హషీం సఫీద్దీన్‌ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే హషీం పరిస్థితి ఏమిటనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు సైనిక పరిశ్రమలే లక్ష్యంగా దాడులు చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటించింది.

'ఇజ్రాయెల్‌ను అమెరికా ఒక సాధనంగా వాడుకొంటోంది'
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లాఅలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువులను కచ్చితంగా ఓడిస్తామని శపథం చేశారు. ఇజ్రాయెల్‌ను అమెరికా ఒక సాధనంగా వాడుకొని పశ్చిమాసియాలోని భూములు, వనరులపై నియంత్రణ కోసం యత్నిస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్‌పై పోరాటం చేస్తున్న పాలస్థీనా, లెబనాన్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. టెహరాన్‌లో జరిగిన శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"హమాస్‌, హెజ్‌బొల్లాలపై ఇజ్రాయెల్‌ ఏ విధంగానూ విజయం సాధించదు. సయ్యద్‌ హసన్‌ నస్రల్లా మనమధ్య లేనప్పటికీ ఆయన సూచించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన బలిదానం వృథా కాదు. శత్రువు ప్రణాళికలను భగ్నం చేస్తాం. వారికి వ్యతిరేకంగా మనమందరం ఏకం కావాలి" అని సుప్రీం లీడర్‌ ఖమేనీ పిలుపునిచ్చారు.

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసిన దాడులను ఖమేనీ సమర్థించారు. హమాస్‌ లేదా హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదన్నారు. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్ నస్రల్లాను ప్రశంసించారు. నస్రల్లా అందరి మధ్య లేనప్పటికీ ఆయన అనుసరించిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందన్నారు. హెజ్‌బొల్లాను దీవించిన చెట్టుగా పేర్కొన్న ఖమేనీ అది నస్రల్లా నాయకత్వంలో క్రమంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ తదుపరి లక్ష్యం ఖమేనీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నస్రల్లా సంస్మరణగా టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఇరాన్‌ సుప్రీం ఖమేనీ ఇజ్రాయెల్‌పై చేసిన క్షిపణి దాడులు ప్రజాసేవలో భాగమేనంటూ సమర్థించుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి వేలాది మంది మద్దతుదారులు హాజరయ్యారు. మరోవైపు ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు ప్రధాన లక్ష్యంగా ఉన్నారు.

హమాస్ అప్రకటిత ప్రధాని హతం- గ్రామాలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు - Israel Hamas war

లెబనాన్​-ఇజ్రాయెల్ సరిహద్దుల్లో 'మృత్యు' సైరన్ల మోత! బిక్కుబిక్కుమంటూ జనం - Iran Israel Tensions In Middle East

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.