Nissan Magnite Facelift Launched: ఇండియన్ మార్కెట్లో కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇంతకుముందు కేవలం ధనవంతుల ఇళ్లల్లోనే కార్లు ఉండేది. అయితే ప్రస్తుతం ప్రతి ఇంట్లో కారు ఉండటం కామన్ అయిపోయింది. సొంతింటి తర్వాత కారు కొనేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల సెల్స్ భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని కంపెనీలు తమ లేటెస్ట్ వెర్షన్ కార్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఈ క్రమంలో దసరా శరన్నవరాత్రుల వేళ మార్కెట్లో సరికొత్త కారు లాంచ్ అయింది.
ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ తన అప్డేటెడ్ మాగ్నైట్ మోడల్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.5.99 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది. అయితే తన తొలి 10వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని, తర్వాత ధరలను సవరిస్తామని నిస్సాన్ పేర్కొంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ ధరను రూ.11.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్:
- ఈ సరికొత్త మాగ్నైట్ కారులో ఇంటీరియర్ పరంగా, ఎక్స్‌టీరియర్ పరంగానూ మార్పులు చేశారు.
- అలాయ్ వీల్స్, స్పోర్ట్ డిజైన్‌తో దీన్ని తీసుకొచ్చారు.
- దీని వెనుక వైపు మోడ్రన్ లుక్‌లో టెయిల్ ల్యాంప్‌ను ఇచ్చారు.
మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్లు:
- 360 డిగ్రీల కెమెరా
- వైర్‌లెస్ ఫోన్ మిర్ర్రరింగ్
- హైట్ ఎడ్జస్ట్‌మెంట్ డ్రైవర్ సీట్
- పవర్డ్ మిర్రర్స్
- ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్
- ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్స్
మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ ఇంజిన్:
- మాగ్నైట్ 1.0 లీటర్ నేచురల్ యాస్సిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71 బీహెచ్‌పీ శక్తిని, 96ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఈ కొత్త కారు 5 స్పీడ్ మాన్యువల్, ఆటో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
- దీని టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 బీహెచ్‌పీని 160 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆప్షన్లలో వస్తోంది.
మార్కెట్లో దీనికి పోటీ: ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మారుతీ సుజుకీ బ్రెజా, టాటా టియాగో, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి కార్లకు ఈ అప్డేటెడ్ మాగ్నైట్ పోటీ ఇవ్వనుంది.
మార్కెట్లోకి ఒకేరోజు రెండు కియా లగ్జరీ కార్లు- ధర, ఫీచర్లు ఇవే..! - Kia Cars Launched in India
స్టన్నింగ్ టైగర్ లుక్స్‌తో కొత్త రేంజ్ రోవర్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Range Rover SV New Edition