ETV Bharat / city

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనే వార్తపై ఎస్​ఈసీ ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో, వెబ్ పత్రికల్లో వస్తున్న తప్పుడు వార్తలపై ఎస్​ఈసీ స్పందించింది. విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జేడీ ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనే వార్తపై ఎస్​ఈసీ ఫిర్యాదు
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందనే వార్తపై ఎస్​ఈసీ ఫిర్యాదు
author img

By

Published : Sep 6, 2020, 5:02 PM IST

స్థానిక ఎన్నికలపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జేడీ కోరారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు వెబ్ మ్యాగజైన్ లకు నోటీసులు పంపారు.

వాట్సప్ గ్రూపుల్లో ఎవరు పోస్ట్ చేశారన్నది ఆరా తీస్తున్నారు. 91 సీఆర్​పీసీ ప్రకారం వెబ్ మ్యాగజైన్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఎవరు వార్తను పంపారో వివరాలు ఇవ్వాలని కోరారు.బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు సూర్యారావుపేట పోలీసులు న్యాయనిపుణులను సంప్రదించారు.

ఇదీ చదవండి:

చైనా ఆశలు రెండు గంటల్లోనే ఆవిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.