వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియకు తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వివిధ సంస్థలకు చెందిన గుత్తేదారులతో వారు చర్చలు జరిపారు. ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పనులు చేపట్టే గుత్తేదారుకు నిర్మాణానికయ్యే ఖర్చులో నామమాత్రపు మొత్తాన్నే ముందుగా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ బ్యాంక్ వడ్డీ, లేదా అంతకంటే తక్కువ వడ్డీరేటుతో సుమారు 12 ఏళ్ల పాటు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది. ఈ విధానంలో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకొచ్చిన అదానీ, వెగాస్, గాయత్రి, మేఘ, రాంకీ లాంటి పలు సంస్థలతో అధికారులు చర్చలు జరిపారు. తొలి విడతలో 12వేల 308 కోట్ల రూపాయలతో 6 జిల్లాల్లో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 ఏళ్ల పాటు దశలవారీగా చేపట్టే ఈ ప్రాజెక్టుకు రూ. 57వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఇవీ చదవండి...కంటిని కాపాడుకునేందుకు 'ట్వంటీ-ట్వంటీ' రూల్