ETV Bharat / city

సికింద్రాబాద్ విధ్వంసం.. సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్ - సికింద్రాబాద్ విధ్యంసం వార్తలు

avula subbarao
avula subbarao
author img

By

Published : Jun 25, 2022, 12:02 PM IST

Updated : Jun 25, 2022, 2:00 PM IST

11:58 June 25

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో అరెస్టయిన ఆవుల సుబ్బారావు

Secunderabad Riots Case: సికింద్రాబాద్​ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా మొదటి నుంచి అనుమానిస్తున్న ఆవుల సుబ్బారావును పోలీసులు అరెస్ట్​ చేశారు. అల్లర్లు జరిగిన అనంతరం పోలీసులు చేసిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో.. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావుతోపాటు ఈ అల్లర్లతో ప్రమేయమున్న అతడి అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

వీరిని పలుమార్లు ప్రశ్నించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. విధ్వంసం సృష్టించాలని యువతను రెచ్చగొట్టినట్లు నిర్ధారించారు. పక్కా ప్రణాళిక ప్రకారం అల్లర్లకు కుట్ర పన్నారని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. చివరికి రైల్వేస్టేషన్​లో విధ్వంసం జరగడానికి మూలకారణం సుబ్బారావేనని తేల్చారు.

విచారణ ముగియటంతో.. సుబ్బారావుకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుబ్బారావుతో పాటు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిని పోలీసులు రైల్వేకోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో సుబ్బారావుకు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రైల్వే కోర్టు నుంచి ఈ నలుగురు నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

సాంకేతిక ఆధారాలతో దొరికిపోయాడు..: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళనకు సంబంధించి అన్ని వ్యవహారాల్లోనూ సుబ్బారావు ప్రమేయం ఉందని రైల్వే పోలీసులు ముందు నుంచీ అనుమానిస్తున్నారు. విధ్వంసం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పదిహేను మంది పోలీస్‌ అధికారులు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యుల ఫోన్‌ నంబర్లన్నింటినీ పరిశీలించారు. అభ్యర్థులు రూపొందించుకున్న ఎనిమిది వాట్సాప్‌ గ్రూపులకుగానూ నాలుగింటిలో సుబ్బారావు సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ నంబరు తెలుసుకున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆయనకు నేరుగా ఫోన్‌చేసి "సుబ్బారావ్‌ ఎక్కడున్నావ్‌" అనగానే ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమై మాస్కులతో స్టేషన్‌లోకి వెళ్లిన అనుచరులకు ఫోన్‌ చేసి పారిపోండంటూ ఆదేశాలిచ్చాడు. అనంతరం హోటల్‌ ఖాళీ చేసి గుంటూరుకు వెళ్లిపోయాడని దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు.

అనుచరులు పట్టుబడటంతో అంగీకారం: ఈ కేసులో సుబ్బారావును అనుమానితుడిగా భావించిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఈ నెల 19న గుంటూరుకు వెళ్లారు. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో ఆయన చెప్పినట్టు సమాచారం. అనేక పరిణామాల అనంతరం మంగళవారం రాత్రి ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. బుధవారం నుంచి ప్రశ్నిస్తున్నా.. తనకేం సంబంధం లేదనే చెబుతూ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు శివ, మల్లారెడ్డి సహా మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రశ్నించగా.. సుబ్బారావుకు రైల్వే విధ్వంసంతో సంబంధం ఉందని, ఆయన తమకు ఫలానా ఫలానా అప్పగించాడని వారు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సుబ్బారావు తాను ఈ నెల 16న సికింద్రాబాద్‌కు వచ్చానని అంగీకరించినట్టు సమాచారం.

ఆ రోజు అసలేం జరిగిందంటే : "అగ్నిపథ్‌"ను వ్యతిరేకిస్తూ... జూన్ 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. రైలు బోగిలకు నిప్పుపెట్టడంతోపాటు... స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఆందోళనకారుల నిరసనలతో... సికింద్రాబాద్ ప్రాంగణం అట్టుడికిపోయింది. అగ్నిపథ్‌ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారం అందుకొని.. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి జూన్ 16 రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న యువకులు.. తెల్లవారి పక్క ప్రణాళికతో సికింద్రాబాద్ స్టేషన్​ కు చేరుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆందోళనకారుల విధ్వంసంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 25, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.