కరోనా నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు తెదేపా నేతలు ముందుకొచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు వెయ్యి మందికి కూరగాయలు పంపిణీ చేశారు. మాజీ ఎంపీటీసీ వంకా మల్లిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా చినగంజాం జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్ కుర్రి రామసుబ్బారావు ఆధ్వర్యంలో 80 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరకులు పంపిణి చేశారు.
కరోనా వైరస్ నిర్మూలనలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఉందని కడప తెదేపా ఇన్ఛార్జ్ అమీర్ బాబు అన్నారు. పట్టణంలోని 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని బేరిపేట, లక్ష్మణ నగర్, మంగపతినాయుడు నగర్ పరిసర ప్రాంతాల్లో.. 2 వేల కుటుంబాలకు 786 సేవా సంస్థ నిర్వాహకులు కూరగాయలు అందజేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో విలేకరుల కృషి మరువలేనిదని అనంతపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వివేకానంద అన్నారు. బ్యాంక్ యాజమాన్యం ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో శ్రీ వివేకానందసేవా సమితి అద్యరంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తెదేపా నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మనవారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారి పల్లె గ్రామంలో ఆలేటి జాన్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి: