నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించే 'ఓపెన్ హౌస్'ను ఈ ఏడాది రద్దు చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం.. ఆహ్లాదకరమైన సమయాన్ని గవర్నర్‌తో పంచుకోవటం చాలా ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ హౌస్‌తో సహా నూతన వేడుకలను నిర్వహించట్లేదని గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు, పౌర సమాజంలోని ప్రముఖులు నూతన సంవత్సరానికి సంబంధించి ఈ మార్పును గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాల మేరకు నూతన సంవత్స వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి