రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,765 పరీక్షలు నిర్వహించారు. 5,963 కేసులు నిర్ధరణ కాగా.. 27 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 2,569 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 48,053 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు
గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1182 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు 938, శ్రీకాకుళం 893, తూర్పుగోదావరి 626, విశాఖ 565, నెల్లూరు 491, కర్నూలు 434, ప్రకాశం 280, కడప 189, కృష్ణా 171, అనంతపురం 156, విజయనగరం 19, పశ్చిమగోదావరి 19 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు
గత 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. చిత్తూరు 4, నెల్లూరు 4, గుంటూరు 2 , కడప 2, కర్నూలు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 2, విశాఖ 2, అనంతపురం 1 చొప్పున ప్రాణాలు విడిచారు.
ఇదీచదవండి