అవినీతిరహిత పాలన అందిస్తామని ఒకవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి చెబుతుండగా, మరోవైపు భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని.... యునైటెడ్ ముస్లిమ్స్ ఆఫ్ ఏపీ కన్వీనర్ అల్తాఫ్ రజా ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 20 లక్షల వరకు వక్ఫ్ ఆదాయానికి గండికొట్టిందన్నారు. ప్రభుత్వం తక్షణమే టెండర్ రద్దు చేసి న్యాయ విచారణ జరిపి అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
ఇది చూడండి: వైభవంగా 'రోషన్ షా వలి దర్గా' మహోత్సవాలు