వైకాపా దౌర్జన్యాలతో 85శాతం వరకు ఏకగ్రీవాలు అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాంతాల్లో తెదేపా సానుభూతిపరులు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారని ఎమ్మెల్సీ అశోక్ బాబు వెల్లడించారు. ఒక్కో పంచాయతీలో 6 మంది వరకు నామినేషన్లు వేశారన్నారు. ఆనాడు ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రజల్లో చాలావరకు చైతన్యం వచ్చిందన్నారు.
సర్పంచుల పాలన ప్రారంభమైతే 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడుకునే అవకాశం ఉండదనే ప్రస్తుత పాలకులు ఈ ఏకగ్రీవాలను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. నిధులను సక్రమంగా వినియోగిస్తే చాలావరకు పల్లెలు బాగుపడతాయని.. మిగిలిన దశల్లోనూ ప్రభుత్వ దుశ్చర్యలను నిలువరించాలన్నారు. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్లు వేయాలని కోరారు.
ఇదీ చూడండి: ఆ సభలే.. పల్లెలకు కీలకం