'జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశాం' - జల్ జీవన్ మిషన్ న్యూస్
జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై వివిధ అంశాలను వివరించారు. రానున్న 5 మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.
!['జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశాం' జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేశాం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9422432-973-9422432-1604434674764.jpg?imwidth=3840)
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 మాసాల్లో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 95.66 లక్షల గ్రామీణ గృహాలకు గానూ 34.92 శాతం మేర ఇంటింటికి కుళాయిలను బిగించినట్లు వెల్లడించింది. దిల్లీ నుంచి జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హాజరై వివిధ అంశాలను వివరించారు.
10,750 కోట్లతో మిగిలిన 60 లక్షల పైచిలుకు గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించినట్లు మంత్రి కేంద్రానికి వివరించారు. రాష్ట్రంలోని 10 వేల పైచిలుకు కరవుపీడిత గ్రామాలకు, ప్రాంతాలకు తాగు నీటిని అందించేందుకు ట్యాంకర్ల ద్వారా 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు, కుళాయిలు బిగించేందుకు తగిన నిధులు అందించాలని కోరారు.