Botsa Satyanarayana: ఎలాంటి అసమానతలూ లేని సమ సమాజాన్ని స్థాపించడమే అంబేడ్కర్ ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన స్ఫూర్తిని సాధించేందుకు ప్రతీఒక్కరూ అంకితం కావాలని బొత్స పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. ఎంతో పకడ్బంధీగా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ గొప్ప మేధావి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ఆయన ధ్యేయమని.. ఆ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అంబేడ్కర్ మార్గం అనుసరణీయమని చెప్పారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాలను సాధించేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాలకు అండగా ఉంటుందన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ భవనాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్థానిక బాలాజీ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులర్పించారు. అనంతరం ఆనంద గజపతి ఆడిటోరియంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు.
ఇదీ చదవండి: 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ప్రారంభిస్తాం: మంత్రి అప్పలరాజు