ETV Bharat / city

పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు...ప్రచారంలో నేతలు బిజీ - ప్రాదేశిక ఎన్నికలు ఏపీ

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో....ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టిసారించారు. ఈనెల 21 న జరగనున్న పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేయగా...వారి వెంట నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు

local-election
పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
author img

By

Published : Mar 15, 2020, 6:55 AM IST

పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోలాహలంతో పల్లెలు, పట్నాలు సందడిగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓట్ల వేట ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ వార్డుల వారీగా ప్రచారం మొదలుపెట్టింది. సెంట్రల్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ....అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో అధికార వైకాపా, తెదేపా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

విస్తృత ఏర్పాట్లు...

ఈనెల 21 న జరగనున్న జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగ్ సిబ్బందికి మండలాల వారీగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి..వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. విశాఖ జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ పాడేరు లో పర్యటించారు. స్థానిక అధికారులతో సమావేశమై.... భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని.... జిల్లా పరిశీలకులు రామారావు అధికారులకు సూచించారు. హిందూపురంలో ఇప్పటికే 12వందల మందిని బైండోవర్‌ చేయగా..5వందల కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించి భంగపడిన అధికార, ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం జరుగుమిల్లిలో వైకాపా నాయకులు వైఎస్సార్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెలుగుదేశం శ్రేణులు బాహాబాహికి దిగాయి.

ఇవీ చూడండి-ఆ గ్రామంలో ఎన్నికల సందడి.. ఒక్క వీధిలోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.