ETV Bharat / city

health commissioner on booster dose: వారంతా తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలి: కాటమనేని భాస్కర్

author img

By

Published : Jan 11, 2022, 6:28 PM IST

health commissioner on booster dose: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బూస్టర్ డోసు వేసుకోవాలని.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ సూచించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ లో.. దేశంలోనే ఏపీ ముందంజలో ఉందన్న ఆయన.. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన కోవిడ్ బూస్టర్ డోసు వేసుకున్నారు.

health commissioner katamaneni bhaskar on booster dose
వారంతా తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలి: కాటమనేని భాస్కర్

health commissioner on booster dose: కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్​లో.. దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్ఫష్టం చేశారు. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బూస్టర్ డోసు వేసుకోవాలని ఆయన సూచించారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన కోవిడ్ బూస్టర్ డోసు వేసుకున్నారు. ప్రాణాలకు తెగించి.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది శ్రమిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ చొరవతో.. కొవిడ్ నియంత్రణలో దేశానికే.. రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యాక్సినేషన్ విజయవంతమయ్యేందుకు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, వైద్యాధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఏఎన్ఎంలు‌, ఆశా వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: Virtual Hearings: కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హైకోర్టులో ఆంక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.