ETV Bharat / city

'మద్యం విధానంలో భారీ అవకతవకలు'

మద్యం అమ్మకాలను పెంచడం ద్వారా భారీగా జే-టాక్స్ వసూలు చేయడమే వైకాపా ప్రభుత్వం లక్ష్యమని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. మద్యం విధానంలో ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడుతోందని విమర్శించారు.

author img

By

Published : May 10, 2020, 7:53 PM IST

former miniser jawahar criticises ycp government
వైకాపా ప్రభుత్వంపై మాజీ మంత్రి జవహర్ విమర్శలు

సంవత్సరానికి 5వేల కోట్లు అక్రమ డబ్బు సంపాదించి.. ఐదేళ్ల పాలన ముగిసే నాటికి 25 వేల కోట్ల రూపాయలు వెనకోసుకోవడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. మద్యానికి అలవాటు పడిన వారి బలహీనతను వైకాపా ప్రభుత్వం క్యాష్ చేసుకుంటోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న చీప్ లిక్కర్ బ్రాండ్లను.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు అనుమతించలేదో గ్రహించాలని ఆయన సూచించారు. పేద కుటుంబాలను వికలాంగులను చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ చర్యలున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి దళిత ఉపముఖ్యమంత్రులపై గౌరవం లేదని.. మొదటి పేజీ ప్రభుత్వ ప్రకటనల్లో ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామి ఫొటో లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.

ఇవీ చదవండి:

'మద్యం దుకాణాలు తగ్గిస్తే.. తాగుబోతుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.