'మద్య నియంత్రణ దిశగా విప్లవాత్మకమైన చర్యలు చేపడుతున్నాం. 33 షాపులు తగ్గించాం. 4380 పర్మిట్లు రద్దు చేశాం. 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం. అమ్మే సమయం తగ్గించాం.. మద్య నిషేధం అమలు దిశగా అడుగులు వేస్తున్నాం' అని చెబుతూ... వైకాపా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో మాట్లాడారు. ఇన్ని చర్యలు తీసుకుంటే తాగుబోతుల సంఖ్య తగ్గిందా అని ప్రశ్నించారు. 2018-19లో 6,220 కోట్ల ఆదాయం వస్తే.. 2019-20లో 8,528 కోట్ల ఆదాయం వచ్చిందని.. మరి ఇంక తాగుబోతుల సంఖ్య ఎక్కడ తగ్గిందన్నారు. మభ్యపెట్టే మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: