విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం ఎదురైంది. కుందావారి కండ్రికలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్యయాత్రల సభలో పాల్గొన్న ఆయనను.. స్థానిక రైతులు నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలైనా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి డబ్బులు లేక ఖరీఫ్‌లో పంటలు వేయలేదని గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం వాస్తవమేనన్న ఎమ్మెల్యే.. నెల రోజులలో ఖాతాలకు నగదు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Ys Sharmila : 'రాసి పెట్టుకోండి...నేను ప్రభంజనం సృష్టిస్తా..'