విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు.
మంగళప్రదమైన దేవతగా మహాలక్ష్మిదేవిని భక్తులు భావిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. శ్రీమహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అమ్మవారుగా భక్తులను అనుగ్రహిస్తారు.
ఇదీ చదవండి:
వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం