ETV Bharat / state

రాత్రి వేళ ఒక్కొక్కరుగా పొలానికి - అనుమానంతో వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్ - FAMILY DEATH IN YSR DISTRICT

వైఎస్సార్ జిల్లాలో విషాదం - భార్య, కుమార్తె, కుమారుడికి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న రైతు

Family Dies in YSR District
Family Dies in YSR District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Family Death in YSR District : నేటి కాలంలో చాలా మంది చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో శుక్రవారం రాత్రి ఓ కుటుంబం అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడింది.

రైతు నాగేంద్ర (40) చీనీ తోట సాగు చేస్తున్నాడు. మరో పది ఎకరాల వరకు కౌలుకు తీసుకున్నాడు. మరోవైపు దాదాపు 20 లక్షల పైగానే అప్పులు చేశాడు. ఇటు ఆదాయం రాకపోగా అటు రుణ భారం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో నాగేంద్ర మనోవ్యథకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలోనే భార్య వాణి (38), కుమార్తె గాయత్రి (12), కుమారుడు భార్గవ్‌ (11)ను రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటలోకి తీసుకెళ్లాడు.

భార్య, పిల్లలకు ఉరి వేసి, తర్వాత నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కొక్కరుగా పొలంలోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామస్థులు అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు​మార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పరిశీలించారు. వీరి మృతికి ఆర్థిక సమస్యలా? ఆరోగ్య సమస్యలా? లేక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ వివరించారు. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు : ఈ ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబంతో సహా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ చేయాలని అధికారులకు సూచించారు. వారి కుటుంబం మృతికి గల కారణాలు తెలియజేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

ప్రేమోన్మాది వేధింపులు - భరించలేక యువతి ఆత్మహత్య

పెన్నుల పంచాయితీ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.