DTF: అమ్మ ఒడి, నాడు-నేడు కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.21 వేల కోట్లు ఖర్చుచేస్తే ఐదురుగు విద్యార్థులే ఆంగ్లంలో మాట్లాడుతున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి జి.మధు విమర్శించారు. బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అమెరికన్ యాసలో ఆంగ్లం మాట్లాడటంపై ఆయన సీఎం జగన్‌కు శనివారం బహిరంగ లేఖ రాశారు. భాష ఏదైనా సరే తెలివితేటలతో మాట్లాడితే వస్తుందనే జగమెరిగిన సత్యాన్ని మరచిపోవద్దని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే వారితో రోజూ మాట్లాడించడంతో ఆ విద్యార్థులకు ఆ దేశ యాస వచ్చిందని లేఖలో రాశారు. పిల్లలకు మాతృభాషతోపాటు సైన్స్, గణితం, సాంఘికశాస్త్రం, ఇతర నైపుణ్యాలేవీ రాకుండా ఒక్క ఆంగ్లంతోనే ఉపాధి అవకాశాలు ఉండవని మధు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: