కృష్ణా జలాలపై తెలంగాణా రాష్ట్రం అనవసరపు వివాదాన్ని రేపుతోందని వైకాపా ఎమ్మెల్సీ డొక్కామాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. వివాదాలను సామరస్యంగా , రాజ్యాంగ స్పూర్తితో పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అన్నారు.
తెలంగాణా రాష్ట్రం దుందుడుకు చర్యలను ఆపి రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన విమర్శించారు. నీటి జలాల వివాదాలపై గతంలో బాబూ జగజ్జీవన్ రామ్ సూచించిన పరిష్కరాన్ని తెలుగు రాష్ట్రాలు ఆచరించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అనవసరపు పట్టింపులను వీడనాడాలని డొక్కా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: