సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి ఉన్న ర్యాంకును నిలబెట్టుకునేందుకు అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ అన్నారు. సచివాలయంలో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో సులభతర వాణిజ్యం, మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను ఆచరణలో పెట్టే ప్రక్రియలో భాగంగా... ప్రజలకు వివిధ సేవలను అందించే విషయంలో మినిమైజేషన్ ఆఫ్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ బర్డెన్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా అందించే వ్యాపార వాణిజ్య సేవలను వినియోగదారులకు సకాలంలో అందేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జోనల్ మేనేజర్లు, నోడల్ అధికారుల వివరాలను అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు సంబంధిత అసోసియేషన్లతో చర్చించాలని సీఎస్ సూచించారు. ఈనెల ఆఖరి వారంలో ప్రధానమంత్రి నిర్వహించే సమీక్షకు ముందే... ఈ అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. 285 బర్డెన్ సమ్ కంప్లయెన్స్లకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన 36 చట్టాల్లో మార్పులు చేర్పులు, రద్దు వంటి అంశాలను గుర్తించామని వాటిని వచ్చే అసెంబ్లీ సమావేశాల ముందుకు తీసుకురానున్నట్టు పరిశ్రమలశాఖ తెలిపింది.
ఇదీచదవండి.