జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పవిత్రమైన విజయవాడ కనకదుర్గ ఆలయంలో అవినీతి రాజ్యమేలుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. అమ్మవారి ఆదాయాన్ని దోచుకున్న మంత్రి వెలంపల్లి పదవి పోయినా.. అతని అనుచరులు ఆగడాలు కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెలంపల్లి మాఫియా ఒకే టిక్కెట్ నెంబర్‌పై 10 దర్శనం టిక్కెట్లు ముద్రించి దోపిడీ చేస్తున్నారన్నారు. అమ్మవారికి 20 గ్రాములలోపు బంగారం కానుకగా ఇస్తే.. రశీదు ఇవ్వకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు.
నిత్య అన్నదానం, అమ్మవారి చీరలు, టోల్గేట్ల్లోనూ వెలంపల్లి దోపిడీ ఉందని తెలిపారు. దసరా సీజన్ మొదలవుతుండటంతో ఏర్పాట్లలో వాటాలు కొట్టేసేందుకు ఇప్పటి నుంచే దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. వివిధ వస్తువులు అమ్మే షాపుల్లోనూ సిండికేట్‌గా ఏర్పడి ఇతరులకు అవకాశం కల్పించట్లేదని మండిపడ్డారు. దుర్గగుడిలో జరుగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి