ETV Bharat / city

అనధికారికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు.. ప్రైవేట్ ల్యాబ్​లలో భారీ వసూళ్లు - ఏపీ కరోనా పరీక్షలు న్యూస్

రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లు కొన్ని చోట్ల దారి మళ్లుతున్నాయి. మరికొన్ని చోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. వాటిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు కొని, అనధికారికంగా పరీక్షలు చేస్తూ భారీ రుసుములు దండుకుంటున్నాయి.

corona-tests-by-private-labs-unauthorized

author img

By

Published : Aug 19, 2020, 6:19 AM IST

ప్రభుత్వ అనుమతి లేకపోయినా... కొన్ని క్లినిక్‌లు, ల్యాబ్‌లు నేరుగా కంపెనీ నుంచే కిట్‌లు కొని మరీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమతి ఉన్న ల్యాబ్‌లలో కొన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయి. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల కనుసన్నల్లో సాగుతున్నాయి. వీరు అధికారులపై ఒత్తిడి తెచ్చి వారి బంధుమిత్రులకు పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా అవసరార్థులకు పరీక్షలు చేసేందుకు కిట్‌లు సరిపోవడం లేదు.

దుర్వినియోగం ఇలా: ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షల్లో రోగి నుంచి నమూనాను తీసుకెళ్లి ల్యాబ్‌లో పరీక్షించాలి. ఇది సుదీర్ఘ ప్రక్రియ. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలో అక్కడికక్కడే ఫలితం తెలిసిపోతుంది. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9 లక్షల కిట్‌లు కొనుగోలు చేసింది. మరో నాలుగైదు లక్షలు కొనబోతోంది. వైద్యారోగ్యశాఖ ఈ కిట్‌లను పీహెచ్‌సీల స్థాయి వరకు సరఫరా చేసింది. ఇటీవల 300 కిట్‌లు దారిమళ్లిన ఘటనకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ వైద్యాధికారిని సరెండర్‌ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే మెడికల్‌ ఆఫీసర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగి, కాకినాడ జీజీహెచ్‌ ఆర్‌ఎంవో సంతకం ఫోర్జరీ చేసిన లేఖను సమర్పించి జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి కిట్‌లు తీసుకెళ్లిపోయారు. విషయం బయటపడటంతో ఆ ఉద్యోగిని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలా కిట్లు దుర్వినియోగం అవుతున్నాయి.

భారీగా వసూళ్లు: ప్రభుత్వం సుమారు 40-50 ఆసుపత్రులు, ల్యాబ్‌లకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలకు అనుమతిచ్చింది. కిట్‌ ధర రూ.450 కాగా, సర్వీస్‌ ఛార్జీలు కలిపి ఒక్కో పరీక్షకు రూ.750 ఫీజుగా నిర్ణయించింది. కొన్ని ల్యాబ్‌లు ఆ నియమాన్ని పాటించడం లేదు. ప్రభుత్వ అనుమతులు లేని కొన్ని ల్యాబ్‌లు పరీక్షలు చేసేస్తున్నాయి. ‘కిట్‌లు బ్లాక్‌లో దొరుకుతున్నాయి. మొదట్లో ఒక్కోటి రూ.950కి వచ్చేది. గత నెలలో రూ.1,200-1,300 తీసుకున్నారు. ఇప్పుడు రూ.1,800కి పెంచేశారు. పరీక్ష చేయడానికి పీపీఈ వేసుకుని వెళ్లాలి. ఆ ఖర్చు కలిపి ఒక్కో పరీక్షకు రూ.4,500 తీసుకుంటున్నాం’ అని విశాఖలో అనధికారికంగా పరీక్షలు చేస్తున్న ఒక వ్యక్తి తెలిపారు.

ఇవీ అనర్థాలు...

* ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్‌లు కానీ తాము నిర్వహించే ప్రతి నిర్ధారణ పరీక్ష వివరాల్నీ ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. అనధికారిక పరీక్షలేవీ లెక్కల్లోకి రావడం లేదు.
* ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో కచ్చితత్వం 60 శాతమే కావడంతో, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినవారికి మళ్లీ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తున్నారు. అక్కడ కొందరికి పాజిటివ్‌ వస్తోంది. అదే అనధికారిక పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినవారికి... ఇక ఎలాంటి పరీక్షలూ చేయడం లేదు. వారిలో కొందరిలో వైరస్‌ ఉన్నప్పటికీ, ఆ విషయం తెలియక స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. అది వారికీ ప్రమాదకరంగా మారడంతో పాటు, ఇతరులకూ ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.
ఎవరు చేయించుకుంటున్నారు
* ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే చోట పెద్దపెద్ద క్యూలైన్లు ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు కొందరు ఇష్టపడటం లేదు. ఒకవేళ పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని వస్తే... క్వారంటైన్‌ కేంద్రానికో, ఆసుపత్రికో పంపిస్తారని కొందరు, తమకు పాజిటివ్‌ వచ్చినట్టు బయటకు తెలియడం ఇష్టంలేక మరికొందరు పరీక్షలకు విముఖత చూపుతున్నారు. వీరు అనధికారిక పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. సమాజంలో పలుకుబడి ఉన్నవారు, ఉన్నతాదాయ వర్గాలవారే ఇలా చేస్తున్నారు.
* కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమకు పాజిటివ్‌ అన్న విషయం బయటకు తెలియకుండా ఇళ్లలోనే కిట్‌లు ఉంచుకుని, పరీక్షలు చేయించుకుంటున్నారు.
* కొన్ని ఆసుపత్రులు రోగులకు శస్త్రచికిత్సలు చేసే ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు బయటి కంపెనీల నుంచో, బ్లాక్‌లోనో కిట్‌లను కొంటున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షలు దాటాయ్​.. కొత్తగా 9,652 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.