రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 70వేల 399 మందికి పరీక్షలు నిర్వహించగా....6 వేల 555 మందికి పాజిటివ్ వచ్చింది. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షల 6వేల 790కి పెరిగింది. యాక్టివ్ కేసులు 56 వేల 897గా నమోదయ్యాయి. ఇప్పటివరకు 6లక్షల 43వేల 993 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 59 లక్షల 48వేల 534 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. మహమ్మారి దెబ్బకు ఇవాళ 31 మంది మరణించగా...మొత్తంగా 5 వేల 900 మంది ప్రాణాలు విడిచారు.
జిల్లాల వారీగా కేసులు...
తూర్పుగోదావరి జిల్లా 975, పశ్చిమగోదావరి 930, చిత్తూరు 925, ప్రకాశం 668, నెల్లూరు 486, కృష్ణా 473, గుంటూరు 451, కడప 339, అనంతపురం 333, విశాఖ 297, విజయనగరం 251, శ్రీకాకుళం 223, కర్నూలు 204 మంది కొవిడ్ బారిన పడ్డారు.
జిల్లాల వారీగా మరణాలు...
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 6, అనంతపురం 4, తూర్పుగోదావరిలో 4, చిత్తూరు 3, కర్నూలు3, విశాఖ 3, గుంటూరు 2, ప్రకాశం 2, పశ్చిమగోదావరి 2, కడప 1, శ్రీకాకుళం1 చొప్పున మరణించారు.
ఇదీచదవండి