ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా గవర్నర్ దంపతులను కలిశారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాజధాని అంశం రాష్ట్రంలో ఉత్కంఠత రేపుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అంశం, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం అయినట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో తమకు న్యాయం చేయాలని రాజధాని ప్రాంత రైతులు ఇటీవల గవర్నర్‌ను కలిశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో సమావేశంలో ఈ విషయాలు ప్రస్తావించి ఉండవచ్చని సమాచారం.
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ... రాజధానిపై చర్చ..? - ap capital issue
రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. గంటపాటు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, రాజధాని అంశాలు వీరి చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.