CM Jagan On Statue of Equality: సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషిచేశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి జగన్ అభినందనలు తెలిపారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారన్నారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
"అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషిచేశారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి అభినందనలు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలి. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారు. సమతామూర్తి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది." - జగన్, ముఖ్యమంత్రి
సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన సీఎం జగన్.. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త జూపల్లి రామేశ్వరావు ముఖ్యమంత్రి జగన్‌కు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. కాసేపట్లో సీఎం జగన్ సమతామూర్తిని దర్శించుకోనున్నారు.
సమత కోసం ప్రపంచంలో ఎందరో పోరాడారు..
రామానుజాచార్యులు సమానత్వం కోసం పోరాడి విజయం సాధించారని చినజీయర్‌స్వామి అన్నారు. దేశంలో సమాజ సేవ..మంచి జరగాలని ఆకాంక్షించారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు క్షేమం జరగాలన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమతా విశేషాలు ఇక్కడి నుంచి అందించేందుకు కృషి చేస్తామన్నారు.
"సమత కోసం ప్రపంచంలో ఎందరో పోరాడారు. అబ్రహం లింకన్ సమాజంలో అంతరాలు తొలగించేందుకు కృషి చేశారు. నల్ల, తెల్లజాతీయుల మధ్య అంతరాలు తొలగించేందుకు కృషి చేశారు. మార్టిన్ లూథర్‌కింగ్ అసమానతలపై పోరాడారు. నల్ల జాతీయుల ఉన్నతి కోసం నెల్సన్ మండేలా పోరాడారు. పలు దేశాల్లో సమానత్వం కోసం వివిధ రకాలుగా పోరాడారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం పోరాడి సాధించారు." -చినజీయర్‌స్వామి
ఇదీ చదవండి
Statue of Equality: సంసిద్ధం శ్రీరామనగరం.. కళ్లు చెెదిరే శిల్ప కళా సౌందర్యం