ETV Bharat / city

ఎమ్మెల్యేనే నకిలీ విత్తనాలతో మోసపోతే సామాన్యుల పరిస్థితేంటి?: చినరాజప్ప

నకిలీ విత్తనాలతో మంగళగిరి ఎమ్మెల్యేనే మోసపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనేది మంత్రి కన్నబాబు సమాధానం చెప్పాలని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. రైతుల్ని పరామర్శిస్తుంటే లోకేశ్​పై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

author img

By

Published : Oct 27, 2020, 2:18 PM IST

ఎమ్మెల్యేనే నకిలీ విత్తనాలతో మోసపోతే సామాన్యుల పరిస్థితేంటి?: చినరాజప్ప
ఎమ్మెల్యేనే నకిలీ విత్తనాలతో మోసపోతే సామాన్యుల పరిస్థితేంటి?: చినరాజప్ప

'మూడు నెలల నుంచి వరుస విపత్తులతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి బయటకు రాలేదు. అక్కడక్కడా తిరిగిన మంత్రులు... చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలకే పరిమితమయ్యారు. ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని లోకేశ్ పరామర్శిస్తుంటే ఆయనపై కేసులు పెట్టడం దుర్మార్గం. రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యల్ని నివారించటంలో ప్రభుత్వం విఫలమైంది. తెదేపా హయాంలో రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ రూ.3100కోట్ల చెల్లిస్తే, వైకాపా ఇప్పటి వరకూ కేవలం రూ. 53కోట్లు మాత్రమే చెల్లించింది. పంట బీమా ద్వారా రైతులను కాపాడకపోగా గందరగోళానికి గురిచేస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధుల్ని రైతు భరోసాలో కలిపేసి ఆర్భాటాలకు పోతున్నారు. ఇకనైనా చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు మానుకుని రైతు సమస్యలు పరిష్కరించాలి." అని చినరాజప్ప హితవు పలికారు.

ఇదీ చదవండి: కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.