విజయవాడ నగరంలో జరుగుతున్న గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దొంగతనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆడియోను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. నగర శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు, స్థానికంగా ఆటోల ద్వారా ఆడియోను ప్రజలకు వినిపిస్తున్నారు. నేరాలను తగ్గించేందుకు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలను విస్తృతం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి