ETV Bharat / city

Chandrababu: మీ కమీషన్లకు ప్రజల్ని బలి చేస్తారా ?: చంద్రబాబు

తెదేపా ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్‌ను సాధించి జగన్‌రెడ్డి చేతిలో పెడితే దాన్ని అస్తవ్యస్తం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత మండిపడ్డారు. ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలను పెంచి ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపారు. అది చాలదన్నట్టు ఆరోసారి మరో రూ.2,542 కోట్లను పెంచి, మొత్తంగా రూ.11,500 కోట్ల భారం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జోనల్ వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రేపట్నుంచి 5 రోజులపాటు 'రైతు కోసం పోరుబాట'

author img

By

Published : Sep 13, 2021, 5:12 PM IST

Updated : Sep 14, 2021, 4:54 AM IST

వైకాపా ప్రభుత్వం కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని ప్రధాన ప్రతిపక్షం తెదేపా ధ్వజమెత్తింది. సరిగా విద్యుదుత్పత్తి చేయించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, తెదేపా ప్రభుత్వ హయాంలో మిగులు విద్యుత్‌ను సాధించి జగన్‌రెడ్డి చేతిలో పెడితే దాన్ని అస్తవ్యస్తం చేశారని మండిపడింది. ఇప్పటికే ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపగా... అది చాలదన్నట్టు ఆరోసారి మరో రూ.2,542 కోట్లు పెంచి, మొత్తంగా రూ.11,500 కోట్ల భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ ముఖ్య నేతలతో సోమవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ‘‘విద్యుత్‌ ఛార్జీల పెంపుతో జగన్‌రెడ్డి పెనుభారం మోపడంతో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చివరకు రొయ్యలు, చేపల చెరువుల రైతుల నుంచి కూడా ట్రూఅప్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రొయ్యల రైతుకి గతంలో రూ.28 వేలు విద్యుత్‌ బిల్లు వస్తుండగా, ఇప్పుడది రూ.58 వేలకు పెరిగింది...’’ అని తెదేపా మండిపడింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు ఇవీ..!

పరామర్శకు వెళ్లిన ముస్లిం నేతపై హత్యాయత్నం కేసా?

  • కడప జిల్లాలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యమన్న అక్బర్‌బాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్‌ ఫారూఖ్‌ షుబ్లీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం మైనార్టీలకు జగన్‌ చేసిన ద్రోహం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. షుబ్లీని వెంటనే విడుదల చేయాలి. తిరుపేలరెడ్డిపై ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు?
  • ప్రభుత్వమే మటన్‌, చేపల షాపులు నిర్వహిస్తుందన్న జగన్‌రెడ్డి వ్యవహారశైలి హాస్యాస్పదంగా మారింది. అది కులవృత్తుల్ని దెబ్బతీసే చర్య.
  • వైకాపా నేతలు దోపిడీలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ముస్లిం, క్రైస్తవ మైనార్టీల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఎయిడెడ్‌ కాలేజీల భూముల్ని కాజేయడానికి జగన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్ని, ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టడాన్ని ఖండిస్తున్నాం.
  • చట్టాల్ని ఉల్లంఘించే పోలీసుల్ని, ఇతర అధికారుల్ని భవిష్యత్తులో వదిలిపెట్టం. వారిపై ప్రైవేటు కేసులు పెడతాం.
  • రేషన్‌ కార్డులు, పింఛన్లు తొలగిస్తూ వైకాపా ప్రభుత్వం పేదల కడుపులు కొడుతోంది. తొలగించిన రేషన్‌ కార్డులు, పింఛన్ల పునరుద్ధరణకు తెదేపా పోరాటం కొనసాగిస్తుంది.
  • వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉంది. వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళతాం.
  • ఫైబర్‌గ్రిడ్‌లో రూ.వేల కోట్లలో అవినీతి జరిగిందని వైకాపా నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రాజెక్టుపై ఖర్చు చేసిందే రూ.307 కోట్లయితే, ఆమేరకు అవినీతి ఎలా జరుగుతుంది? తెదేపాప్రభుత్వం రూ.149కే కనెక్షన్‌ ఇవ్వగా, దాన్ని జగన్‌రెడ్డి రూ.350కి పెంచారు. దానిలో పనిచేసిన 19 మందిపై అక్రమకేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం.

పార్టీ వ్యవహారాలు బయట మాట్లాడొద్దు

పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవలసిన విషయాల్ని కొందరు నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడుతున్నారని, అది ఆమోదయోగ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు, అశోక్‌బాబు, రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

రైతు కోసం పోరుబాట కార్యక్రమం

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం... మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు తెదేపా రైతు కోసం పోరుబాట కార్యక్రమం చేపడుతోంది. పొలాల్ని కౌలుకి చేసుకునే పరిస్థితులూ లేవు. పెట్టుబడి వ్యయం రెట్టింపైంది. రాయితీలు నిలిచిపోయాయి. వ్యవసాయశాఖ మూతపడింది. రైతులకు జగన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారు. రైతు కుటుంబాల సగటు రుణభారం రూ.2.50 లక్షలు దాటిపోయి, దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటం జగన్‌రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం.

ఇదీ చదవండి

Skill Development: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల: సీఎం జగన్

Last Updated : Sep 14, 2021, 4:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.