ETV Bharat / city

మేం వద్దన్నా పోస్టులెలా పెడతారు ?: హైకోర్టు

రాజధాని భూముల విషయంలో అనిశా కేసు వివరాలను ఎలక్రానిక్ , ప్రింట్ , సామాజిక మాధ్యమాల్లో నిలువరిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చినా...ఎలా పోస్టు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

మేం వద్దన్నా పోస్టులెలా పెడతారు
మేం వద్దన్నా పోస్టులెలా పెడతారు
author img

By

Published : Oct 10, 2020, 4:41 AM IST

రాజధాని భూముల అంశంపై దాఖలైన అనుబంధ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో గతనెల 15న హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని, తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు చెప్పేందుకు వీలు కల్పించాలని న్యాయవాది మమతారాణి ఈ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ పై కౌంటర్ వేశామన్న మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తరపు న్యాయవాది... మమతారాణి బదులివ్వాల్సి ఉందన్నారు . అనిశా కేసు వివరాల్ని ఎలక్రానిక్ , ప్రింట్ , సామాజిక మాధ్యమాల్లో నిలువరిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చినా... ఫేస్‌బుక్‌లో పరువు నష్టం వ్యాఖ్యలు పోస్ట్ చేశారన్నారు. అనుబంధ పిటిషన్ వేసి ఆ వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు . ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ బదులిస్తూ... ఫేస్ బుక్‌ను అనుబంధ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చలేదన్నారు . ఆ పోస్టుల తొలగింపునకు వేరే ప్రక్రియను అనుసరించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని తెలిపారు. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయవాది ప్రణతి మరికొంత గడువు కావాలని కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.

ఇదీచదవండి

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.