HC on Padmavathi Bhavanam: కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ బాలాజీ జిల్లాకు తిరుపతి తిరుచానూరులోని శ్రీపద్మావతి భవనంలో జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. పద్మావతి నిలయంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటును నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
మరోవైపు కలెక్టర్ కార్యాలయం కోసం భవనం, గదుల ఆకృతులను మార్చొద్దని తేల్చిచెప్పింది. తాము ఇచ్చిన ఉత్తర్వులకు ప్రభావితం కాకుండా... ప్రధాన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించాలని స్పష్టంచేసింది. ప్రజా అవసరాల కోసం భవనాన్ని లీజుకి ఇచ్చే అధికారం తితిదేకి ఉందన్నారు
ఇదీ చదవండి: తిరుపతి కలెక్టరేట్‌కు పద్మావతి నిలయం అప్పగింతపై హైకోర్టు స్టే