ETV Bharat / city

గరుడ సేవను రద్దు చేసిన తితిదే - tiruamala garudaseva news

తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసినట్లు తితిదే ప్రకటించింది. ఈ నెల 28న పౌర్ణమి కాగా ఆ రోజు వరకు పుష్కరిణిలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుండడంతో గరుడసేవను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

tirupathi temple
తిరుమల గరుడ సేవ వార్తలు, తిరుమల తాజా వార్తలు
author img

By

Published : Mar 27, 2021, 3:29 PM IST

తిరుమలలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుండడంతో ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే గరుడ సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 28న పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ జరగాల్సి ఉంది.

'ఈ ఏడాది తుంబుర తీర్థంకు అనుమతి లేదు'

ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున తుంబుర తీర్థ ముక్కోటిని తితిదే వైభవంగా నిర్వహిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గల ఈ తీర్థానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏడాది తుంబుర తీర్థానికి భక్తులకు అనుమతి నిలిపివేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి విఫలయత్నం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.