విద్యార్థుల ఉపకార వేతనాల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. రెండేళ్లుగా 80 లక్షల మందికి ఉపకార వేతనాలు అందలేదని మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న 75 శాతం నిధులకు.. 25 శాతం నిధులను జత చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఉపకార వేతనాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. రెండేళ్లుగా 80 లక్షల మందికి ఉపకార వేతనాలు ఇవ్వలేదు. కేంద్రం ఇస్తున్న 75 శాతం నిధులకు.. 25 శాతం నిధులను జత చేయడంలో ప్రభుత్వం విఫలం. వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయకుంటే ఉద్యమం చేస్తాం. - చింతా మోహన్, కాంగ్రెస్ నేత
ఇదీ చదవండి
Nani Fire On Pawan: 'జగన్పై విషం చిమ్మేందుకే పవన్ అవాకులు, చెవాకులు'