ETV Bharat / city

రాష్ట్రంలో విధ్వంసం అప్పటినుంచే మొదలైంది : చంద్రబాబు - chandrababu latest news

చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన(chandrababu chittoor district tour) కొనసాగుతోంది. భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా.. ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. సీఎం గాలిలో తిరుగుతారా? అని నిలదీశారు. అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం వరద ప్రాంతాల్లో పర్యటించాలన్నారు.

chandrababu
chandrababu
author img

By

Published : Nov 24, 2021, 1:00 PM IST

Updated : Nov 24, 2021, 10:55 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటించారు. (chandrababu chittoor district tour) వరద బాధితులకు మనో ధైర్యం ఇచ్చేందుకే తాను వచ్చానని చంద్రబాబు తెలిపారు. పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ఏంచేసిందన్న బాబు.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం కలిగేదా? అని ప్రశ్నించారు. ఎవరూ అధైర్యపడవద్దని.. తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరద సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. సీఎం గాలిలో తిరుగుతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో నా భార్య వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడారు. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉన్నా.. ఆమె బయటకు రాలేదు. 40 ఏళ్లుగా ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా. అలిపిరిలో నా కారుపై మందుపాతర పేలినా భయపడలేదు. నా భార్యపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా. మీ కుటుంబంలో మహిళలకు ఇలా జరిగితే మీరు బాధపడరా..? కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశా. ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పా. ఇలాంటి ఉన్మాదులతో నేను పోరాడాలా..? నేను కంపెనీలు తెస్తే.. వీళ్లు దందాలు చేస్తున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారు. ఎన్నో అక్రమాలు చేసి కుప్పం ఎన్నికల్లో గెలిచారు. తప్పుడు పనులు చేసేవాళ్లను అధికారంలోకి వచ్చాక వదిలేది లేదు.

-చంద్రబాబు, తెదేపా అధినేత

ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే.. ఇంత నష్టం జరిగేదా?: చంద్రబాబు

జగన్‌కు ఏదో మానసిక సమస్య ఉంది..
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికలో వైకాపా నేతలు నానా రభస చేశారని చంద్రబాబు(TDP president chandrababu naidu fire on YCP government) విమర్శించారు. కౌన్సిల్‌ హాల్లో కుర్చీలు, మైకులు విరగ్గొట్టారని మండిపడ్డారు. చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు. కొండపల్లి విషయంలో జగన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న చంద్రబాబు.. తెదేపాకు చిన్న మున్సిపాలిటీ వచ్చినా.. తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇవన్నీ చూస్తుంటే జగన్​కు ఏదో మానసిక సమస్య ఉన్నట్టుందన్నారు.

రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోంది..
తిరుచానూరులో వరద బాధితులను చంద్రబాబు(Chandrababu tour in Tiruchanuru) పరామర్శించారు. రెండున్నరేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభమైందని, రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చంద్రబాబు ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఖనిజ సంపదపై దుర్మార్గుల కళ్లు పడ్డాయని ఆక్షేపించారు. ప్రభుత్వం సేవ చేయదు.. చేసే వారిని చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవలో పోటీ పడాలి కానీ.. దాడుల్లో కాదని తెదేపా అధినేత హితవు పలికారు.

వరద సమస్యలపై నిర్దిష్టమైన డిమాండ్లు పెడదాం. సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతాం. వైకాపాకు దోచుకోవటం.. దాచుకోవడం తప్ప మరో పని లేదు. పద్ధతిలేని సీఎం.. హద్దుల్లేని పార్టీ వైకాపా. మొండికేసిన ఎద్దును ముల్లు కర్రతో పొడవడానికే నేను వచ్చాను. సీఎం ఏమైనా వృద్ధుడా..?టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ముద్దులతో జనం మోసపోయారు.. గుద్దులతో రియలైజ్ అవుతున్నారు.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పా: చంద్రబాబు

ఇసుక కోసమే...

తిరుపతిలోని వరదప్రభావిత ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. ఇసుక కోసమే అన్నమయ్య ప్రాజెక్టు(Annamaiah project)లో నీరు నిల్వ చేశారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అధిక నీటి నిల్వ వల్ల ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలగుంట చెరువులోని నీరు ఇళ్లను ముంచిందని మండిపడ్డారు. ఇన్నేళ్లుగా రాని వరద నీరు ఇప్పుడెందుకు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు.

బాల్యమిత్రుడితో జ్ఞాపకాలు..

తిరుపతి గాయత్రినగర్​లోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు బాల్య మిత్రుడు శ్రీనివాసనాయుడు తారసపడ్డారు. అనంతరం స్నేహితుడికి ఇంటికి వెళ్లారు. బాల్యమిత్రుడితో చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు.

ఇదీ చదవండి

Last Updated : Nov 24, 2021, 10:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.