ETV Bharat / city

TTD Special Invites: తితిదేలో ప్రత్యేక ఆహ్వానితులందరినీ రద్దు చేయాలి: భాను ప్రకాశ్‌ - ప్రత్యేక ఆహ్వానితులు వార్తలు

తితిదే ప్రత్యేక ఆహ్వానితులందరినీ రద్దు చేయాలని భాజపా నేత భాను ప్రకాశ్‌ డిమాండ్ చేశారు. ఇంతమంది సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యుల పూర్వాపరాలు విచారించకుండా నియామకాలా ? అని ప్రశ్నించారు.

తితిదేలో ప్రత్యేక ఆహ్వానితులందరినీ రద్దు చేయాలి

author img

By

Published : Sep 18, 2021, 7:51 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..తన సొంతం అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని భాజపా నేత భాను ప్రకాశ్ మండిపడ్డారు. తితిదేలో ప్రత్యేక ఆహ్వానితులను ఏ ప్రాతిపదికన నియమించారో సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

తితిదేలో ప్రత్యేక ఆహ్వానితులు అందరినీ రద్దు చేయాలి. హిందూ ధార్మిక వ్యవస్థలో ఇష్టం వచ్చినట్లు జోక్యం చేసుకుంటున్నారు. ఇంతమంది సభ్యులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో చెప్పాలి. ఇంత జంబో బోర్డు అవసరమా అనేది మరోసారి ఆలోచించాలి కొందరు బోర్డు సభ్యులపై కేసులు ఉన్నాయి. పూర్వాపరాలు విచారణ చేయకుండా సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులా ?. దర్శనం కోసమే ప్రత్యేక ఆహ్వానితులను నియమించారా ?. ఐదుగురితో మొదలైన తితిదే బోర్డు ఇవాళ 80కి చేరింది. రవిప్రసాద్‌ ఎవరో మాకు తెలియదు. జంబో బోర్డుపై విచారణ జరిపించాలి. - భానుప్రకాశ్, భాజపా నేత

ఇదీ చదవండి

TTD BOARD: 24 మందితో తితిదే నూతన పాలక మండలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.