'అమ్మఒడి' రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం నెల్లూరులో ప్రారంభించనున్నారు. నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న సీఎం... ఉదయం 11.10 గంటలకు పోలీసు పేరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11:30గం.కు సభా ప్రాంగణానికి చేరుకుని అమ్మఒడి రెండో విడత పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తిరిగి 1:35 గంటలకు నెల్లూరు నుంచి హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరనున్నారు.
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులు అనిల్ కుమార్ , మేకపాటి గౌతం రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి