Smoke From Train: నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భువనేశ్వర్ నుంచి తిరుపతి బయల్దేరిన భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లో వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే పొగలు లేచాయి. ఎస్-3 భోగి నుంచి పొగ రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భోగి నుంచి పొగ రావటాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలు నిలిపివేశారు. ప్రయాణికులు కిందకి దిగి.. భోగి నుంచి దూరంగా పరుగులు తీశారు. సమస్యను గుర్తించిన సిబ్బంది.. పొగను అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య పరిష్కారం కావటంతో రైలు అక్కడినుంచి బయలుదేరి వెళ్లింది.
ఇవీ చదవండి: