షీర్ వాల్ టెక్నాలజీతో నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్మించిన గృహ సముదాయం... పశువుల నిలయంగా మారింది. గత ఆరు నెలలుగా గృహ సముదాయంలో అహ్లదకరమైన వాతావరణం కనుమరుగవుతూ వచ్చింది. ఈ సముదాయాన్ని 4,800 కుటుంబాల కోసం నిర్మించారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో ఎన్.సీ.సీ సంస్థ నిర్మాణాలు వేగంగా పూర్తి చేసింది. ఎన్నికల సమయంలో లబ్దిదారులకు కేటాయించారు. అధికారులు, సంస్థ ప్రతినిధుల పర్యవేక్షణ కరవైనందున... దొంగలు పడి ఇళ్లలో ఫ్యాన్లు, వైర్లు చోరీకి గురయ్యాయి. ఆకతాయిలు ఇళ్ల అద్దాలను పగలగొట్టారు. పశువులు, కుక్కలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి.
ఇదీ చదవండి