కడప జిల్లా రైల్వేకోడూరులోని నరసరాంపేటలో భారీ వర్షాలకు రెండంతస్తుల భవనం కుప్పకూలింది. పది రోజులుగా కురుస్తున్న వానలకు గుంజన ఏరు ఉద్ధృతంగా(Water flow of Gunjana stream) ప్రవహిస్తోంది. దీంతో భూమి భారీగా కోతకు గురై రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఇంకా ఎన్ని నివాసాలు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. 30 సంవత్సరాలుగా గుంజన ఏరు చుట్టుపక్కలా రక్షణ గోడ నిర్మించాలని కోరినా అధికారులు స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
తమ కళ్ల ముందే ఇల్లు కుప్పకూలిపోవడంతో ఆవేదనకు లోనైన నరసరాంపేట వాసులు.. ఆందోళన(Protest in narasarampeta) చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి.. ప్రభుత్వం వెంటనే ఇల్లు నిర్మించాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.