అక్రమంగా నిల్వ ఉంచిన రెండు మద్యం స్థావరాలపై కడప పోలీసుల దాడులు చేశారు. 170 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోగా.. వీటిలో 35 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యం బాటిళ్లున్నాయి. కడప రవీంద్ర నగర్‌కు చెందిన షేక్ మస్తాన్ మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబడి.. మద్యం కొనుగోలు చేసి వాటిని కర్ఫ్యూ సమయంలో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడి నివాసంపై దాడులు చేసి 135 మద్యం సీసాలను పట్టుకున్నారు.
కడప రాయచోటి రోడ్‌లోని రైల్వే వంతెన కింద అక్రమంగా నిల్వ ఉంచిన 35 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సునీల్ హెచ్చరించారు.
ఇదీ చూడండి.
మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులటా?: లోకేశ్